ఆపిల్ తింటున్నారా? అయితే, పొరపాటున కూడా దాని గింజలు తినకండి.

ఒక వేళ ఆపిల్ గింజలు తిన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.

ఎందుకంటే, యాపిల్ గింజలు విషంతో సమానమట.

ఆపిల్ గింజల్లో ఉండే అమాక్డాలిన్ అనే పదార్థం చాలా ప్రమాదకరమైనది.

ఆపిల్ గింజలను నమిలినప్పుడు ఆ పదార్థం హైడ్రోజన్ సైనైడ్‌గా మారిపోతుంది.

హైడ్రోజన్ సైనైడ్ రక్తంలో కలిస్తే శ్వాసకోశ సంబంధ సమస్యలు ఏర్పడతాయి.

ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. కాబట్టి, మీ పిల్లలకు గింజలు తీసి పెట్టండి.

హైడ్రోజన్ సైనేడ్ వల్ల శరీరంలోని ఆక్సిజన్ సరఫరాను నిలిపేస్తుంది. ఫలితంగా ఉక్కిరి బిక్కిరి అవుతారు.

ఆపిల్ గింజలు విషపూరితమా? తింటే ఏమవుతుంది?

ఆపిల్ కోసేప్పుడే దానిలోని గింజలు తీసేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు.

Images Credit: Pexels