ఎప్పటికీ యంగ్‌గా ఉండిపోవాలని ఉందా? ఈ ఆహారం తినండి.

బెర్రీలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ వంటి పండ్లు శరీరం మీద వయసు ప్రభావాన్ని తగ్గిస్తాయి.

చేపల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇవి చర్మంలో తేమ నిలిపి ఉంచి ముడతలు రాకుండా నిరోధిస్తాయి.

డ్రైఫ్రూట్స్ లో ఖనిజలవణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆసిడ్లు వయసు ప్రభావం కనిపించకుండా చేస్తాయి.

ఆకుకూరల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించి చర్మం నునుపుగా యవ్వనంగా కనిపించేట్టు చేసే విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి.

ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే కొల్లాజిన్ ఉత్పత్తి పెరిగి సన్ డ్యామేజి నుంచి చర్మం కాపాడబడుతుంది.

అవకాడోలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, సి తోపాటు మంచి కొవ్వులు కూడా ఉంటాయి.

ఇవి చర్మంలో తేమ నిలిపి ఉంచి సన్ డ్యామేజి నుంచి కాపాడి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

టమాటల్లో లైకోపిన్ ఉంటుంది. ఇది స్కిన్ టెక్చర్ ను ఆరోగ్యంగా ఉంచి సన్ డ్యామేజి నుంచి కూడా కాపాడుతుంది.

టమాటలను ఉడికించినపుడు లైకోపిన్ ఎక్కువగా విడుదలవుతుంది.

గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి.

గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే సన్ డ్యామెజీ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

Representational Image : Pexels