గుడ్డుతో జుట్టు బాగా పెరుగుతుందని అంటారు. అందులో నిజమెంతో చూద్దాం.

గుడ్డులోని పోషకాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుడ్డులోని విటమిన్లు ఎ, ఇ తోపాటు ఫోలేట్ జుట్టు ఆరోగ్యంగా, మందంగా పెరిగేందుకు సహాయపడతాయి.

గుడ్డులో ఉండే ప్రొటీన్ వల్ల జుట్టు కి ఇది మంచి పోషకాహారంగా చెప్పవచ్చు. కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.

గుడ్డుతో హెయిర్ ప్యాక్ వేసినపుడు జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలడం పూర్తిగా తగ్గిస్తుంది.

జుట్టును హైడ్రేటెడ్ గా ఉంచడం వల్ల జుట్టు ఎలాస్టిసిటి మెరుగవుతుంది. ఫలితంగా జుట్టు చిట్లే సమస్యకు మంచి పరిష్కారం.

క్రమం తప్పకుండా ఎగ్ ప్యాక్ ను వాడడం వల్ల జుట్టు మెరుపు సంతరించుకుని ఆరోగ్యంగా పెరుగుతుంది.

గుడ్డులో ఉండే ప్రొటీన్ నిస్తేజంగా, పొడిబారిపోయిన కుదుళ్లకు బలాన్ని ఇచ్చి తిరిగి అందంగా తయారయ్యేందుకు దోహదం చేస్తుంది.

పొడిబారిన జుట్టుకు గుడ్డు ప్యాక్ వెయ్యడం వల్ల జుట్టు తేమ నిలిపి ఉంచుకుంటుంది.



Representational Image : Pexels