పొట్టిగా ఉంటే మధుమేహం వస్తుందా?



ప్రపంచంలోని ఎంతో మంది శాస్త్రవేత్తలు మధుమేహంపై అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు.



జర్మనీ చేసిన అధ్యయనంలో మధుమేహం వచ్చే అవకాశం పొట్టిగా ఉండే వారిలో ఎక్కువని తేలింది



ఎత్తుగా ఉండే వారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారు త్వరగా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నట్టు ఆ కొత్త అధ్యయనంలో తెలిసింది.



ఎత్తు తక్కువగా ఉన్న మగవారికి 41 శాతం మధుమేహం వచ్చే అవకాశాలు పెరిగితే, ఆడవారికి 33 శాతం వరకు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.



ఎత్తు తక్కువగా ఉండే వారిలో కాలేయం కొవ్వును అధికంగా స్టోర్ చేస్తుంది. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది.



మధుమేహంలో టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ అని మూడు రకాలు ఉన్నాయి.



ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 42 కోట్ల మందికి పైగా మధుమేహం ఉందని అంచనా.



మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లే మధుమేహం బాధితులను పెంచుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.