కరివేపాకును ఎందుకు తినాలంటే...



చాలామంది తినేటప్పుడు కరివేపాకుని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. దానికి విలువే లేదనుకుంటారు.



నిజానికి కరివేపాకు చేసే మేలు ఇంతా అంతా కాదు, ఇది ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.



బరువు తగ్గాలనుకుంటున్న వారు కరివేపాకుతో చేసిన వంటకాలను అధికంగా తినండి. ఇది ఇట్టే బరువును కరిగించేస్తుంది.



కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. దీనిలో ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, క్యాల్షియం అధికంగా ఉంటాయి.



కరివేపాకు రసాన్ని తీసి నిమ్మరసం కలిపి ప్రతి రోజు తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.



ఖాళీ కడుపుతో కరివేపాకు రసాన్ని తాగితే కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం వంటివి కూడా పోతాయి.



మధుమేహంతో బాధపడుతున్న వారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో కరివేపాకు ఒకటి.



దీనివల్ల డయాబెటిస్ సమస్య పెరగకుండా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతుంది.