శరీరం పని తీరు బావుండాలంటే తప్పనిసరిగా గట్ హెల్త్ బావుండాలి.

ప్రాసెస్డ్ ఫూడ్, అనారోగ్యకర కొవ్వులు, ఫైబర్ తక్కువ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే గట్ హెల్త్ సరిగా ఉండదు.

పండ్లు, కూరగాయలు, గింజలు, ప్రొటీన్ ఎక్కువ కలిగిన సమతుల ఆహారం మీద దృష్టి పెట్టాలి.

పైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం అనేది సాధారణంగా అందరి ఆహారంలో ఉండే లోపం.



దీర్ఘకాలం పాటు ఒత్తిడి కొససాగితే అది గట్ హెల్త్ మీద చాలా దుష్ప్రభావం చూపుతుంది.

ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ వంటివి ఒత్తడిని నివారించేందుకు బాగా ఉపయోగపడతాయి.

చాలా మందికి రకరకాల ఆహారపదార్థాలు పడవు, అలర్జీలు అవుతుంటాయి. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

సమయానికి తినకపోతే ఎక్కువ తినెయ్యడం లేదా తక్కువ తినెయ్యడం చేస్తారు. కనుక సమయానికి భోంచెయ్యడం అవసరం.

పరిమితికి మించి తీసుకునే ఆల్కహాల్ వల్ల జీర్ణవ్యవస్థ మీద చాలా దుష్ప్రభావాలు ఉంటాయి.

ఆల్కహాల్ తీసుకోవడం మానలేని వారు పరిమితికి మించి తీసుకోకుండా జాగ్రత్త పడాలి.

ఫైబర్ ఎక్కువగా ఉండే గిజలు, లెగ్యూమ్స్ ఎక్కువగా తీసుకోవాలి.
Representational image : Pexels