కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం మీకు అలవాటా? అయితే మీకు ఈ ముప్పు తప్పదు.

కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నపుడు హిప్ అలైన్మెంట్ సరిగ్గా ఉండదు.

హిప్ బ్యాలెన్స్ లో లేనందు వల్ల శరీరం దిగువ భాగంలో జరిగే రక్త ప్రసరణ వేగంలో మార్పు వస్తుంది. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు.

కొందరు మోకాలు మీద మోకాలు వేస్తే, కొందరు పాదాలు చీలమండల దగ్గర ఒకదాని మీద ఒకటి వేసుకుంటారు.

ఈ రెండు విధానాల్లో ఏదీ కూడా సరైంది కాదట.

మోకాలు మీద కాలు వేసి కూర్చోవడం వల్ల బీపీ పెరుగవచ్చు.

అందుకే బీపీ చెక్ చేసే సమయంలో రెండు పాదాలను సమానంగా నేల మీద ఉంచమని సూచిస్తారు.

కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటే కండరాల్లో వాపు, కటి ఎముకల్లో శాశ్వత మార్పులు జరిగే ప్రమాదం ఉంటుంది.

వెన్నెముక అమరికలో తేడాలు రావడం వల్ల మెడదగ్గరి ఎముకల అమరికల్లో కూడా తేడాలు ఏర్పడవచ్చు.

Representational image : pexels