సంపుల్లో వచ్చే నీరు పరిశుభ్రంగా ఉండటం లేదని చాలా మంది మినరల్ వాటర్ తెచ్చుకుంటారు.



మినరల్ వాటర్ స్వచ్చమైనవని భావిస్తారు. శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని నమ్ముతారు.



బయటకి వెళ్ళి డబ్బులు పెట్టి మినరల్ వాటర్ కొనుగోలు చేసే
బదులు మీరే ఇంట్లోనే సింపుల్ గా వాటిని తయారు చేసుకోవచ్చు.


ఇంట్లోనే మినరల్ వాటర్ చేసుకునేందుకు శుభ్రమైన గాజు లేదా కంటైనర్ తీసుకోవాలి.



అందులో ఒక లీటర్ ఫిల్టర్ చేసిన నీటిని కంటైనర్ లో నింపాలి.
అందులో 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా ఫిల్టర్ చేసిన నీటిలో కలపాలి.


శుద్ది చేసిన నీటిలో 1/8 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, 1/8 టీ స్పూన్ పొటాషియం బైకార్బోనేట్ కలపాలి.



చివర్లో సోడా సిఫోన్ కలుపుకోవాలి. అంతే బయట కొనుగోలు
చేసినట్టుగా ఉండే మినరల్ వాటర్ సిద్ధంగా ఉంటుంది.


సింపుల్ గా ఇంట్లోనే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మినరల్ వాటర్ సిద్ధం చేసుకోవచ్చు.



పొటాషియం, ఎప్సమ్ సాల్ట్ వంటి పదార్థాలు జోడించడం వల్ల అజీర్ణం, ఉబ్బరం,
విరోచనాలు, గుండెల్లో మంట, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గిస్తుంది.


గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Images Credit: Pexels