జుట్టు ఆరోగ్యానికి నేరుగా ఆలోవేరా మొక్క ఆకులుగానీ, మార్కెట్‌లో లభించే ఆలోవెరా జెల్ గానీ వాడొచ్చు.

తాజా ఆలోవెరా జెల్ ఉపయోగిస్తే జుట్టు చాలా శుభ్రంగా కడుక్కోవాలి.

ఆకుల నుంచి జెల్ సేకరించి దాన్ని మిక్సీలో బ్లెండ్ చేసి స్మూత్ జెల్ గా చేసుకోవాలి.

ఆలోవెరా జెల్ జుట్టు మీద ఉపయోగించే ముందు స్కాల్ప్ , జుట్టు శుభ్రంగా కడిగి పొడిగా తుడిచి పెట్టుకోవాలి.

తర్వాత 5, 10 నిమిషాల పాటు మజాజ్ చెయ్యాలి.

30 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత కడిగేసుకోవచ్చు. టైమంటే గంట కూడా వదిలెయ్యవచ్చు.

గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. కావాలంటే తేలికపాటి షాంపు కూడా ఉపయోగించవచ్చు.

ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

Representational image : pexels