కీరా దోస ఎందుకు తినాలి?



కీరా దోస అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. కానీ ఎక్కువమంది వేసవికాలంలోనే వాటిని తింటూ ఉంటారు.



నీటితో నిండిన ఈ కీరా దోసలను తినడం వల్ల శరీరంలో తేమ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.



కీరా దోసకాయను కొందరు తొక్కతోపాటు తింటే మరికొందరు తొక్క తీసేసి తింటారు. ఎలా తిన్నా ఆరోగ్యమే.



తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, పీచు అధికంగా ఉంటాయి.



వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల జబ్బులు బారిన పడకుండా కాపాడుతాయి.



ఒంట్లో నీటి శాతం తగ్గితే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కీరాదోసలో 96 శాతం వరకు నీరే.



నీళ్ల బాటిల్ తీసుకెళ్లడానికి వీలు లేకపోతే రెండు మూడు దోసకాయలు తీసుకెళ్లండి చాలు. దాహం తీరిపోతుంది.



బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కీరాదోస చాలా మంచి ఎంపిక.