వాస్తులో పడక గదులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పడక గదిలో కొన్ని వస్తువులు మరచిపోయి కూడా పెట్టకూడదు బెడ్ రూమ్ గోడలకు ముదురు రంగులు వాడకూడదు. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లకు లేత నీలం, తెలుపు వంటి రంగులు వాడడం మంచిది. ఆరెంజ్, రెడ్ వంటి ముదురు రంగుల గోడలు ఉంటే నిద్ర, మానసిక ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. బెడ్ రూమ్ లో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. షూరాక్ ఉంచకూడదు. ఇది మానసిక క్షోభకు కారణమవుతుంది. పడక గదిలో నలుపు రంగు బెడ్ షీట్లు వాడకూడదు. మురికిగా ఉన్న బెడ్ షీట్లను క్రమంతప్పకుండా మార్చుకోవాలి. బెడ్ రూమ్ లో తాజ్ మహల్ చిత్రం లేదా బొమ్మ పెట్టుకోవద్దు. తాజ్ మహల్ సమాధి కనుక నిష్క్రియాత్మకతను ప్రతిబింబిస్తుంది. కనుక దీన్ని ఇంట్లో పెట్టుకోవద్దని వాస్తు సూచిస్తోంది. Representational Image : Pexels