ఒక్క సారి డయాబెటిస్ మొదలైతే శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాల మీద దీని ప్రభావం ఉంటుంది.

అందుకే తప్పనిసరిగా డయాబెటిస్ అదుపులో పెట్టుకోవడం అవసరం.

మధుమేహంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.

డయాబెటిక్ నెఫ్రోపతి రక్తంలో చక్కెరలు అదుపులో లేకపోతే కిడ్నీలను దెబ్బతీసే సమస్య.

క్రమం తప్పకుండా కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకోవాలి.

డయాబెటిక్ రెటినోపతి మధుమేహం కారణంగా కళ్లను దెబ్బతీసే సమస్య. సమయానికి జాగత్త పడకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

డయాబెటిస్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు.

పాద సంరక్షణ, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం.

స్థూలకాయం టైప్ 2 డయాబెటిస్ కు ముఖ్యమైన కారణం కావచ్చు. కొన్ని సార్లు మధుమేహులు బరువు పెరగవచ్చు.

ఆహారం, వ్యాయామం, క్రమం తప్పని మందులతో ఈ పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం అవసరం.
Representational Image : Pexels