ప్రతి రోజు తప్పని సరిగా 2వేల క్యాలరీల శక్తినిచ్చే ఆహారం అవసరం.

ఇందులో తప్పని సరిగా 45 నుంచి 65 శాతం అంటే 225-325 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండాలి.

25-30 శాతం లేదా 80 గ్రాముల అసంతృప్త కొవ్వులు ఉండాలి.

రకరకాల రంగుల్లో పండ్లు, కూరగాయలు ఉండాలి. 10-35 శాతం ప్రొటీన్ ఉండాలి.

మిగిలిన భాగం పెరుగు, ఊరగాయల వంటి ఫర్మెంటెడ్ పదార్థాల నుంచి ప్రోబయోటిక్స్ అందుతాయి.

రోజుకు 200 గ్రాముల పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎన్నో జబ్బులు నివారించవచ్చు.

గుండె జబ్బు ప్రమాదం 8 శాతం, స్ట్రోక్ ప్రమాదం 16 శాతం, క్యాన్సర్ ముప్పు 10 శాతం వరకు తగ్గుతుంది.

పర్పుల్ క్యాబేజి, ఎర్ర తోటకూర వంటి రకరకాల రంగుల్లో ఉండే అన్ని కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

అన్ని రకాల పండ్లు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా సీజనల్ పండ్లు తప్పక తీసుకోవాలి.



Representational Image : Pexels