మాంసాహారాన్ని పూర్తిగా మానేసి.. శాఖాహారిగా మారిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్లాంట్ బేస్డ్ ఫూడ్ కి మారడం వల్ల శరీరంలో జరిగే కొన్ని ముఖ్య మార్పులను తెలుసుకుందాం. శాఖాహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్దకం నివారించబడుతుంది. శాఖాహారంతో బరువు తగ్గుతారు. తక్కువ క్యాలరీలు ఉంటాయి, ఫైబర్ ఎక్కువ కనుక కడుపు నిండుగా ఉంటుంది. మాంసాహారం మానేయ్యడం లేదా బాగా తగ్గించడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఇన్ల్ఫమేషన్ తగ్గుతుంది. మాంసాహారం మానేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగు పడతాయి. గుండె ఆరోగ్యానికి ఇది అవసరం. పండ్లు, కూరగాయలు, గింజల వినియోగం పెరిగితే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు చేరే రేటు పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల బెడద ఉండదు. మాంసాహారం తీసుకున్న తర్వాత ఉండే భుక్తాయాసం శాఖాహారం తీసుకుంటే ఉండదు. Representational Image : Pexels