మెలటోనిన్ ఎక్కువగా ఉండే బాల్సమిక్ వెనిగర్ ను పచ్చి ఆలీవ్ నూనెతో కలిపి తీసుకుంటే త్వరగా నిద్ర పడుతుంది. పిస్తా పప్పులో మెలటోనిన్ ఎక్కువ. వీటిని సలాడ్ తో తీసుకుంటే త్వరగా నిద్ర వస్తుంది. పిస్తా నచ్చని వారు బాదాములు ట్రై చెయ్యవచ్చు. ప్రతి రోజూ రాత్రి వీటిని తీసుకుంటే నిద్ర పాటర్న్ సెట్ అవుతుంది. రాత్రి భోజనానికి కొద్ది మోతాదులో వైట్ రైస్ కలిపినా సరే మంచి నిద్ర కు ఉపకరిస్తుంది. రాత్రి డెసర్ట్ గా స్ట్రాబెర్రీలను తీసుకుంటే త్వరగా నిద్ర వస్తుంది. చమోమిలే టీ వెచ్చగా పడుకునే ముందు తీసుకుంటే కొద్ది సమయంలోనే గాఢ నిద్రలోకి జారుకోవచ్చట తాజా టమాట స్లైస్ లు సలాడ్ తో కలిపి తీసుకుంటే త్వరగా నిద్ర పడుతుంది. చెర్రీ జ్యూస్ లో కూడా మెలటోనిన్ ఎక్కువ కనుక రాత్రి పూట ఒక గ్లాస్ తీసుకుంటే త్వరగా నిద్ర పోవచ్చు. Representational Image : Pexels