PCOD అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలుతుంది. అనువంశికత, పోషకాహార లోపం, పరిమితికి మించి స్టయిలింగ్ చెయ్యడం ఏకారణంతో అయినా జుట్టు రాలవచ్చు. అందులో హార్మోన్లలో మార్పులు కూడా ఒకటి. పోషకాహారం తీసుకోవాలి. ఐరన్, విటమిన్ సి, బయోటిన్ వంటి విటమిన్లు లోపించకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువగా డై చెయ్యడం, హీట్ స్టయిలింగ్ టూల్స్ వాడకం, కెమికల్ ట్రీట్మింట్లు, స్టయిలింగ్ ఉత్పత్తుల వాడకం జుట్టును దెబ్బతీస్తుంది. వీలైనంత వరకు సహజమైన విధానంలోనే స్టయిలింగ్ చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒత్తిడి జుట్టు మీద చాలా ప్రభావం చూపుతుంది. తగినంత వ్యాయామం, ధ్యానం, తగినంత నిద్ర మంచి ప్రభావం చూపుతాయి. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు తల శుభ్రంగా ఉండాలి. చుండ్రు లేకుండా జాగ్రత్త పడాలి. తలకు మసాజ్ చెయ్యడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సల్ఫేట్, కఠినమైన రసాయనాలు లేని ఉత్పత్తులు మాత్రమే ఉపయోగించాలి. Representational Image : Pexels