రోజూ తాగే నీళ్లతో బరువు తగ్గొచ్చట. హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు ఇదొక అదనపు లాభం. అదెలాగో తెలుసుకుందాం తగినంత హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల జీవక్రియాలు సక్రమంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు చేరదు. భోజనానికి ముందు నీళ్ల తాగితే కడుపు నిండుగా ఉండి ఎక్కువ తినకుండా క్యాలరీ ఇన్ టేక్ తగ్గించవచ్చు. నీళ్లను మీకు నచ్చే పానీయంగా భావిస్తే అనవసరపు క్యాలరీలు చేర్చకుండా హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. కొవ్వుల సంశ్లేషణకు శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం అవసరం. కనుక నీళ్లు తాగుతుండాలి. కొన్ని సార్లు దాహంగా ఉన్నా కూడా ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అనవసరంగా తినకుండా కనుక ముందు నీళ్లు తాగి చూడాలి. వర్కవుట్ సమయంలో హైడ్రేటెడ్ గా ఉంటే మరింత శ్రమిస్తారు. మరిన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. Representational Image : Pexels