మనిషికి మాత్రమే గుండెపోటు ఎందుకు వస్తుంది? మిగతా జీవులతో పోలిస్తే గుండె పోటుతో మరణించే శాతం మనుషుల్లో చాలా ఎక్కువ. జంతువుల్లో ఉండి, మనలో లేని ఒక జన్యువే దీనికి కారణమని చెబుతున్నారు పరిశోధకులు. ఆ జన్యువు పేరు ‘సీఎంఏహెచ్’. ఇది రెండు లక్షల ఏళ్ల క్రితం వరకు మనుషుల్లో ఈ జన్యువు ఉండేది. తరువాత నశించి పోయింది. అది ఇప్పటికీ మన శరీరంలో ఉండి ఉంటే గుండె పోటు వచ్చే అవకాశమే ఉండేది కాదట. సీఎంఏహెచ్ జన్యువు ఎప్పుడు, ఎందుకు మానవుల శరీరం నుంచి నిర్వీర్యమైపోయిందో మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు పరిశోధకులు. చింపాంజీలు, ఇతర క్షీరదాలకు కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. వాటికి వచ్చే అవకాశం లేదని తేలింది. ఎందుకంటే వాటిలో ఇంకా ఈ జన్యులు జాడ ఉంది.