చక్కెర, మితిమీరిన చిక్కటి పాలు, క్రీమ్ జోడించుకుని మరీ కాఫీ తాగారంటే మాత్రం బరువు పెరిగిపోతారు. పాలతో చేసిన కాఫీ కంటే బ్లాక్ కాఫీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గే విషయంలో ప్రీమిక్స్డ్ టీ అత్యంత ఎక్కువ మంది తీసుకుంటారు. కానీ దీనిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి హెర్బల్ టీ ఉత్తమ ఎంపిక. శీతల పానీయాలు, సోడా ఆధారిత ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల దాహం అయితే తీరుతుంది. కానీ దీని వల్ల బరువు పెరుగుతారు. కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల రక్తంలో చక్కెర, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. పండ్ల రసాలు ఆరోగ్యకరమైనవి అని అందరూ అనుకుంటారు. అవి రుచిగా ఉండేందుకు అందులో చక్కెర జోడించడం వల్ల కేలరీలు పెరుగుతాయి. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు తాజాగా ఉన్న పండ్లు తినడమే మంచిది. డిన్నర్ తో కలిపి ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కేలరీల సంఖ్య మరింత పెరిగి బరువు వస్తారు.