చర్మసౌందర్యాన్ని, రక్తాన్ని పెంచే చక్కటి పరిష్కారం... బీట్ రూట్, క్యారెట్, టమోటా జ్యూస్.
చిన్న బీట్ రూమ్ ముక్క, క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు కలిపి కాస్త నీరు వేసి జ్యూస్ చేసుకోవాలి.
ఖాళీ పొట్టతో ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితాలు వస్తాయి. రెండు వారాలు ఈ జ్యూస్ తాగితే చాలు మీకు వెంటనే తేడా తెలుస్తుంది.
నీరసం తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు చురుగ్గా ఉంటారు. చర్మంలో కూడా మెరుపు కనిపిస్తుంది.
ఈ జ్యూస్ తాగడం అలవాటుగా మార్చుకుంటే భవిష్యత్తులో బీపీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
హైబీపీ ఉన్న వాళ్లు దీన్ని తాగితే బీపీ అదుపులో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో కూడా ఇది సాయపడుతుంది.
శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోకుండా బీట్ రూట్ జ్యూస్ కాపాడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు కూడా రావు.
చాలా మంది పచ్చి బీట్ రూట్ జ్యూస్ అనగానే ముఖం ముడుచుకుంటారు. నిజానికి ఈ జ్యూస్ ను ఎవరైనా తాగేయగలరు. దీనికి పెద్దగా టేస్ట్ ఉండదు. నీళ్లలాగే అనిపిస్తుంది.