బియ్యప్పిండి, పచ్చిబఠాణీతో టేస్టీ రొట్టె

బియ్యప్పిండి - ఒక కప్పు
పచ్చి బఠాణీ - ఒక కప్పు
పచ్చి మిర్చి - రెండు
జీలకర్ర - టీ స్పూను

ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకులు - ఒక రెమ్మ
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక టీస్పూను

పచ్చిబఠాణీలను ఉడికించి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

ఒక గిన్నెలో బియ్యంప్పిండి, పచ్చిబఠాణీలు బాగా కలపాలి.

ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి.

ఆ ముద్ద నుంచి బూరె సైజులో చిన్నముద్దలా తీసుకోవాలి. పాలిథిన్ కవర్ మీద చేత్తో పూరీలా ఒత్తుకోవాలి.

దానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి.

చిన్న మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. దీని రుచి చాలా బాగుంటుంది.