శరీరం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడుతుంది. దీని ఫలితంగా హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరిగి చివరికి గుండెపోటుకి దారి తీస్తుంది. బయటకి వెళ్ళే ముందు దాదాపు 5-10 నిమిషాల పాటు యోగా సాధన చేయాలి. ఆస్తమా ఉన్న వాళ్ళు బయటకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఇన్ హేలర్ దగ్గర పెట్టుకోవాలి. ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఉంటే మంటలల దగ్గర కూర్చవకపోవడమే మంచిది. బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. చల్లని గాలి ఊపిరితిత్తులకి చేరకుండా ఉంటుంది. గుండె జబ్బులు నివారించడానికి కఠినమైన శారీరక శ్రమలకి దూరంగా ఉండాలి. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ గుండెకి కష్టంగా ఉండే పనులు చేయకపోవడం ఉత్తమం. తగినంత నీరు తాగాలి. ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవాలి.