చలికాలంలో రోజుకో ఉసిరికాయ తింటే... శీతాకాలంలో ఉసిరికాయలు కచ్చితంగా తినాలి రోజుకొకటి తిన్నా చాలు, ఎంతో మేలు. ఉసిరిలో చక్కెర తక్కువ ఉంటుంది, కాల్షియ, ఇనుము, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇందులో ఉంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో క్రోమియం ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మెదడుకు కూడా ఉసిరి ఎంతో మంచిది. బ్రెయిన్ టిష్యూలు పాడవకుండా కాపాడుతుంది. ఉసిరిలో ఉండే గుణాలు జుట్టును మెరిపిస్తాయి. జీర్ణ వ్యవస్థకు ఉసిరిలో సుగుణాలు ఎంతో ఉపయోగపడతాయి. ఉసిరికాయలు సీజనల్‌గా దొరుకుతాయి కాబట్టి, దొరికిన సీజన్లోనే తినాలి.