డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నిలాభాలో డ్రూ ఫ్రూట్స్ చాలా మంది తినరు, కానీ అవి రోజూ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జీడిపప్పు,బాదం, పిస్తా, వాల్ నట్స్, సన్స్ ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఎండు ఖర్జూరాలు... ఇవన్నీ కలిపి రోజుకు గుప్పెడు తింటే చాలు. కంటి చూపు మెరగవుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కూడా ఇవి కాపాడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అవసరం. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి.