వరి బియ్యం మాదిరిగానే వెదురు నుంచి కూడా బియ్యం వస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. వెదురు బియ్యం చాలా చిన్నగా గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. కానీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వరి కంకులు వచ్చినట్లే వెదురుకి కూడా పూత వచ్చి కంకులు వస్తాయి. కానీ ఇవి చాలా అరుదుగా వస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. విటమిన్లు ఏ, బి1, బి2, బి3, బి 6 ఉన్నాయి. వెదురు బియ్యంలో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. వెదురు బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఆహారం. డయాబెటిస్ రోగులకి ఇది చాలా మంచిది. గిరిజనులు వీటిని జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు తింటారు. వెదురు బియ్యం కొద్దిగా తీపిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకి పోగొడతాయి. వెదురు బియ్యం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు తక్కువ, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.