మధుమేహం గురించి చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటినే నిజమని అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే..



అపోహ: పంచదార వల్ల మధుమేహం వస్తుంది.
వాస్తవం: పంచదార తినడం వల్ల నేరుగా మధుమేహం వచ్చే అవకాశం లేదు.
కానీ చక్కెర ఆహారాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కు ప్రమాదం.

అపోహ: మధుమేహం సీరియస్ గా తీసుకోవద్దు
వాస్తవం: మధుమేహం ఒకసారి వచ్చిందంటే నయం చేయలేరు. అది నియంత్రణలో లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.


అపోహ: మధుమేహం స్థూలకాయం ఉన్న వారిపై మాత్రమే ప్రభావం చూపిస్తుంది.
వాస్తవం: అధిక బరువు, ఊబకాయం టైప్ 2 డయాబెటిస్ కి ప్రమాద కారకాలు


ఊబకాయం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది కానీ ఖచ్చితంగా వ్యాధికి కారణం కాదు.



మధుమేహం ఉన్న వాళ్ళు చక్కెర తినకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.



అపోహ: మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోతారు.
వాస్తవం: అన్ని సందర్భాల్లో ఇది నిజం కాదు. షుగర్ కంట్రోల్ లో లేకపోతే కంటి చూపు మసకబారుతుంది.


అపోహ: ప్రీ డయాబెటిస్ ఎప్పుడు డయాబెటిస్ కి దారి తీస్తుంది.
వాస్తవం: సరిగా పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రీ డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్ గా అభివృద్ధి చెందుతుంది.


శారీరక శ్రమ, వ్యాయామం చెయ్యడం వల్ల శరీరం చురుకుగా ఉంచుకోవచ్చు.
అలాగే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బరువు తగ్గొచ్చు.