శక్తివంతమైన పోషకాలు కలిగి ఉండే గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.



గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అసంతృప్త కొవ్వులు, బీటా కెరోటిన్, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ.



గుమ్మడి గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.



ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడతాయి. నొప్పులని తగ్గిస్తాయి.
ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఇది సహాయపడుతుంది.


ట్రిప్టోఫాన్, జింక్, మెగ్నీషియం గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రశాంతమైన నిద్రని ఇస్తాయి.



సలాడ్, స్మూతీస్ లో చేర్చుకోవడం వల్ల అదనపు రుచి వస్తుంది.



వీటిని నిల్వ చేసుకోవడం కూడా చాలా సులువు. ఒక జాడీలో పోసుకుని రోజుకో గుప్పెడు గింజలు తింటే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.



ఇందులోని మాంగనీస్, విటమిన్ కె గాయాల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.



మెగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు గట్టి పడతాయి.



మగవారు గుమ్మడిగింజలను రోజుకో గుప్పెడు తింటే వారిలో వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది.