కరోనా వేళ తీపి పదార్థాలు కంటే.. ఘాటుగా, విటమిన్-సితో నిండిన రెడ్ బెల్ పెప్పర్ తీసుకోవడం మేలు.

రెడ్ బెల్ పెప్పర్స్‌ను ఉడక బెట్టకుండా.. ఫ్రై లేదా రోస్ట్ చేసినప్పుడే పోషకాలు దెబ్బతినకుండా శరీరానికి అందుతాయి.

గ్రీన్ టీలో కెఫిన్ శాతం తక్కువ. ఇది బ్లాక్ టీ, కాఫీకి బదులుగా తాగొచ్చు. దీనిలోని ఫ్లేవనాయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అల్లంలోని యాంటి ఇంఫ్లమెటరీ, యాంటిఆక్సిడెటివ్ గుణాలు.. రోగాల నుంచి కాపాడుతాయి.

పాలకూరలోని పోషకాలు, యాంటిఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, కేరోటినయిడ్స్, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పాలకూరలో అధికంగా ఉండే విటమిన్ E, విటమిన్ C జలుబు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

బ్రోకలీలోని యాంటిఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సాల్మన్, పిల్చార్డ్లు, టూనా ఫిష్‌లలో ఉండే Omega-3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటిఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Omega-3 ఫ్యాటీ ఆసిడ్స్ కీళ్ల వాతం వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి.

పసుపులోని కుర్క్యుమిన్ కాంపౌండ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image Credit: Pexel, Pixabay