రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలు ఇవే రాత్రి ఆలస్యంగా భోజనం తినేవాళ్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. రాత్రి ఎనిమిదిలోపే భోజనం పూర్తి చేయాలి. రాత్రి పది, పదకొండు గంటలకు ఆలస్యంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి ఆలస్యంగా ఆహారం తినడం వల్ల సరిగా జీర్ణం కాదు. దీని వల్ల మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. బరువు కూడా త్వరగా పెరుగుతారు. ఆలస్యంగా ఆహారం తినడం వల్ల రాత్రి నిద్ర సరిగా పట్టదు. అధిక రక్తపోటు సమస్యను కూడా పెంచుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు త్వరగా వచ్చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.