ఈ ఫంగస్ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారా? మనదేశంలోకి చైనా సైనికులు చొరబడుతున్న సంగతి తెలిసిందే. వీరి చొరబాటకు ఓ ఫంగస్ కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఆ ఫంగస్‌ను ‘కీడా జోడి’ అని పిలుస్తారు. హిమాలయన్ గోల్డ్, హిమాలయన్ వయాగ్రా అని కూడా వీటిని పిలుస్తారు. ఇవి పుట్టగొడుగుల వర్గానికి చెందినవని చెప్పుకుంటారు, చూడటానికి మాత్రం గొంగళి పురుగుల్లా ఉంటాయి. ఇవి కిలో దొరికాయంటే లక్షాధికారి అయిపోవచ్చు. కిలో 20 నుంచి 25 లక్షలు ఉంటాయి. వీటిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్... ఇలా లెక్కలేనని గుణాలు ఉన్నాయి. అలాగే ప్రొటీన్లు, పెప్టైడ్స్, అమినో ఆమ్లాలు, విటమిన్ బి1, బి2, బి12 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కేవలం పది గ్రాముల కీడా జడిని కొనాలంటే ఎంత లేదన్నా యాభై ఆరువేల రూపాయలు ఖర్చు పెట్టాలి. హిమాలయాల కు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వీటిని ఏరుకుంటూ పర్వతాల మీదకి వెళతారు. ఎంతో మంది ప్రాణాల కోల్పోతారు కూడా.