అన్నం ఇలా వండితే... బరువు పెరగరు అధిక బరువుతో బాధపడేవారు, మధుమేహులు అన్నం తినేందుకు భయపడతారు. అధికంగా తింటే కెలోరీలు అధికంగా ఒంట్లో చేరుతాయని వారి భయం. కానీ చిన్న చిట్కాతో అన్నంలో కెలోరీలు సగానికి పైగా తగ్గించుకోవచ్చు. పరిశోధనల ప్రకారం బియ్యంలో కేలరీలను తగ్గించడానికి సమర్థమంతమైన మార్గం ఒకటుంది. అన్నం ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో ఒక టీస్పూను కొబ్బరి నూనె చేర్చి బాగా కలపాలి. కొబ్బరినూనె వల్ల అన్నంలోని కెలోరీలు 50 శాతం పైగా తగ్గిపోతాయి. కొబ్బరినూనె వేసి వండిన అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచి కొన్ని గంటల తరువాత తింటే కెలోరీలు ఇంకా తగ్గిపోతాయి. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అన్నం చల్లబడి కదా అనుకోవచ్చు, తినడానికి ముందే అన్నం బయట పెడితే సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. కొబ్బరినూనె కలపడం వల్ల కెలోరీలు తగ్గుతాయన్న విషయాన్ని శ్రీలంకకు చెందిన పరిశోధకులు తేల్చారు.