కోడిగుడ్డుతో గుంతపొంగనాలు


కోడి గుడ్లు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
మిరియాల పొడి - చిటికెడు



ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
నిమ్మరసం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను


ఒక గిన్నెలో నాలుగు గుడ్లు కొట్టి గిలక్కొట్టాలి.

అందులో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

అందులో కొత్తిమీర తరుగు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

ఇప్పుడు స్టవ్ మీద గుంతపొంగనాలు వేసుకునే కళాయి పెట్టి వేడి చేయాలి.

అందులో కోడి గుడ్ల మిశ్రమాన్ని పొంగనాల్లా వేసుకుని పైన మూత పెట్టాలి.

రెండు వైపులా కాల్చుకుని ప్లేటులో వేసుకోవాలి. వీటికి చట్నీ అవసరం లేదు.