నోటిలో బ్యాక్టీరియా, పళ్ళు శుభ్రంగా లేకపోవడం ఒక్కటే కాదు కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా నోటి దుర్వాసనకి కారణం అవుతాయి. నోటి దుర్వాసనని అరికట్టేందుకు కొన్ని ఆయుర్వేద మార్గాలు ఉన్నాయి. చిగుళ్ళ వ్యాధులు, వెల్లుల్లి, పచ్చి ఉల్లిపాయలు తినడం, గట్ సమస్యల వల్ల నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. నోటి శుభ్రత చాలా ముఖ్యం. అందుకోసం రోజుకి రెండు సార్లు గోరువెచ్చని త్రిఫల కాషాయాలతో నోరు పుక్కిలించుకోవాలి. క్రాష్ డైట్, శరీరం హైడ్రేషన్ గా లేకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం నీటిని బాగా తీసుకోవాలి. కొన్ని మందులు కూడా యాసిడ్ రిఫ్లక్స్ ని అడ్డుకుంటాయి. వాటి ద్వారా నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. నోటి దుర్వాసన పోగొట్టుకునేందుకు సోంపు అద్భుతమైన ఔషధం. భోజనం చేసిన తర్వాత కాసిన్ని సోంపు గింజలు నోట్లో వేసుకుని నమలాలి. నోటి దుర్వాసన మధుమేహం, మూత్రపిండ వ్యాధి వంటి అంతర్లీన పరిస్థితులకి సూచిక కావచ్చు. నోరు శుభ్రంగా ఉంచుకునేందుకు రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఆయిల్ పుల్లింగ్, మౌత్ ఫ్రెషనర్స్ కూడా వాడవచ్చు.