BF.7వేరియంట్ మరో వేవ్ తప్పదా? ఒమిక్రాన్ ఉప వేరియంట్ BF.7 చైనాలో అత్యంత వేగంగా పాకుతోంది. BF.7 వేరియంట్ టీకా వేసుకున్న వారిని వదలడం లేదు. చైనాలో వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి సోకడం కలవరానికి గురిచేస్తోంది. మరొక్కసారి BF.7వేవ్ రూపంలో వస్తే తట్టుకోవడం కష్టమేనని చెబుతున్నారు వైద్య నిపుణులు. కేవలం చైనాలోనే 15 లక్షల మంది దీని బారిన పడి మరణించే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వారికి ఇది త్వరగా సోకుతుంది. కాబట్టి ఆహార పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వేరియంట్ సోకిన ఒక వ్యక్తి దాదాపు 10 నుంచి 18 మందికి దీన్ని వ్యాప్తి చెందించగలడు. ఇప్పటికే మనదేశంలో కొన్ని కేసులు బయటపడ్డాయి. అయితే ఇవి వేవ్‌గా మారుతుందా? లేక సాధారణ కేసులుగా వచ్చిపోతాయో చూడాలి.