రోజును ప్రారంభించాలంటే గుక్కెడు టీ గొంతులో పడాల్సిందే. అది సమయానికి పొట్టలో పడకుంటే ప్రాణం విలవిలలాడిపోతుంది.

రోజుకో కప్పు టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యా లేదు కానీ కొంతమంది రోజులో నాలుగు నుంచి అయిదు కప్పుల టీని తాగేస్తుంటారు.

అధిక మొత్తంలో టీ తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు ఉన్నాయి.

టీలో కూడా కెఫీన్ ఉంటుంది. దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి.

టీలో థియోఫిలిన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

టీలో కెఫిన్ ఉంటుంది, యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. గుండెల్లో మంటను ప్రేరేపిస్తుంది.

టీ లోని కెఫీన్ నిద్ర అలవాట్లను ప్రభావితం చేస్తుంది. నిద్రలేకపోవడం వల్ల అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి రుగ్మతలు వచ్చేలా చేస్తుంది.

చర్మంపై మొటిమలు వస్తుంటే టీ తాగడం ఆపేయండి. పాలతో చేసిన టీ మొటిమలు రావడం పెరుగుతుంది.

టీ గర్భస్రావం లేదా శిశువు బరువు తక్కువగా ఉండేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో టీ అస్సలు తీసుకోకపోవడమే మంచిది.

బ్లాక్ టీ, గ్రీన్ టీ, చామంతి పూల టీ.. ఇలా అనేక రకాల టీలు ఉన్నాయి. మితంగా దాగితే మంచి ఫలితాలు పొందొచ్చు. Imges Credit: Pexels