క్రిస్‌మస్ కేకు - కుక్కర్లో వండేయండిలా


రాగి పిండి - ముప్పావు కప్పు
గోధుమ పిండి - ముప్పావు కప్పు
కోకో పొడి - పావు కప్పు
పంచదార - అరకప్పు
వెనిల్లా ఎసెన్స్ - పావు స్పూను



బేకింగ్ పొడి - ఒకటిన్నర స్పూను
పాలు - ఒకటిన్నర కప్పు
బేకింగ్ సోడా - అర స్పూను
డార్క్ చాక్లెట్ - పెద్దది ఒకటి
బటర్ - అర కప్పు
బాదం పప్పులు - గుప్పెడు
ఉప్పు - చిటికెడు



రాగిపిండి, గోధుమపిండి, కోకో పొడి, చక్కెర, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి.


ఆ మిశ్రమంలో పాలు, బటర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా గిలక్కొట్టాలి.

కేకు మౌల్డ్ కింద వెన్న పూసి, కాస్త పిండి చల్లాలి.

కేకు మిశ్రమాన్ని మౌల్డ్‌లో వేయాలి. గాలి బుడగలు లేకుండా నేలపై ఆ మౌల్డ్‌ని మెల్లగా తట్టాలి.

కుక్కర్ అడుగు భాగంలో మెత్తటి ఇసుక లేదా రాళ్ల ఉప్పు వేయాలి. మూత పెట్టి ప్రీ హీట్ చేసుకుంటే మంచిది.

తరువాత మూత తీసి కేకు మౌల్డ్‌ను అందులో పెట్టి, కుక్కర్ మూత పెట్టేయాలి.


తరువాత మూత తీసి కేకు మౌల్డ్‌ను అందులో పెట్టి, కుక్కర్ మూత పెట్టేయాలి.