ఈ లోపం వల్ల హైబీపీ వచ్చే అవకాశం అధిక రక్త పోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరంలో పొటాషియం లోపం చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది. అలాగే కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి అదనపు సోడియం బయటికి పంపించేందుకు కూడా పొటాషియం అవసరం. ఇది లోపిస్తే రక్తనాళాలు బిగుసుకుపోయి, రక్తం అతివేగంగా నాళాల గోడలను గుద్దుకుంటూ వెళతాయి. దీని వల్ల రక్తపోటు వస్తుంది. అలాగే గుండెదడ, అలసట, కండరాల బలహీనత, తిమ్మిర్లు పట్టడం వంటతి సమస్యలు వస్తాయి. పొటాషియం కోసం ఆకుకూరలు, బీన్స్, నట్స్, పాల ఉత్పత్తులు తినాలి. అరటిపండ్లు,సీతాఫలం, ద్రాక్షలు, నారింజ, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, చిక్కుళ్లు వంటి వాటిలో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది.