ప్రతి సెకనుకు రెండు బిర్యానీల ఆర్డర్ బిర్యానీని పడగొట్టే ఫుడ్ ఇంకా పుట్టలేదు. ఆ వాసనకే నోరూరిపోతుంది. ఇక తింటే స్వర్గమే గుర్తొస్తుంది. ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ మరోసారి బిర్యానీని ఈ సంవత్సరంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా ప్రకటించింది. ఏకంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయి. అంటే సెకనుకు 2.28 ఆర్డర్లు అంటూ ఆ నివేదికలో రాసుకొచ్చింది. కేవలం స్విగ్గీలోనే ఇలా అమ్ముడుపోతుంటే ఇక జొమాటో వంటి ఇతర ఫుడ్ అగ్రిగేటర్లలోని అమ్మకాలు చూస్తే బిర్యానీ ఇంకా ఎక్కువగానే అమ్ముడవుతున్నట్టే లెక్క. మొఘలులు మన దేశానికి వచ్చి మనకి ఇచ్చిన అద్భుత బహుమతి బిర్యానీ అని చెప్పుకోవచ్చు. పెర్షియన్ ఆహార సంస్కృతి నుంచి వచ్చిన రుచికరమైన ఆహారం బిర్యానీ. ఇప్పుడు ప్రపంచమంతా పాకింది బిర్యానీ రుచులు. అందులోనూ స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్లే అధికంగా వస్తున్నాయిట.