చాలా మంది సన్నబడటానికి గ్రీన్ టీ తాగుతారు. కానీ దాని వల్ల హానికరమైన అనార్థాలు కూడా ఉన్నాయి.



పరగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు గ్రీన్ టీ సేవించడం అంత మంచిది కాదు.
ఖాళీ పొట్టతో దీన్ని తాగడం వల్ల ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయి జీర్ణక్రియ దెబ్బతింటుంది.


గ్రీన్ టీ మంచిదే కానీ, అతిగా తాగడం వల్ల మాత్రం ఆరోగ్య సమస్యలు మొదలవ్వచ్చు. ఇందులో కూడా కొద్ది మోతాదులో కెఫీన్ ఉంటుంది.



రోజుకు నాలుగైదు కప్పులు తాగితే శరీరంలో కెఫీన్ అధికంగా పేరుకుపోవచ్చు.
రోజుకు రెండు కప్పులకు మించి తాగకపోవడమే ఉత్తమం.


నిద్రని ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని గ్రీన్ టీ లోని రసాయనాలు అణచి వేస్తాయి.



గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం ఐరన్ గ్రహించకుండా చేస్తుంది.



అధికంగా తీసుకుంటే వికారం, వాంతులు అవుతాయి. గ్రీన్ టీ టానిన్లు వికారం, మలబద్ధకంతో సంబంధం కలిగి ఉంటుంది.



ఇది ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఇందులోని కెఫీన్ కాలేయంపై పేరుకుపోవడం వల్ల వ్యాధులు వస్తాయి.



గ్రీన్ టీ సమ్మేళనాలు కాల్షియం గ్రహించకుండా నిరోధిస్తాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది.



రక్త స్రావం ఇబ్బందులు పెంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా ఉండే వ్యాధి ఉంటే దీన్ని తాగకపోవడమే మంచిది.