ఆవలిస్తే కంటి నుంచి నీళ్లెందుకొస్తాయి?

చాలా మంది ఈ విషయాన్ని గమనించి ఉంటారు. కానీ ఎందుకు వస్తాయో మాత్రం చాలామందికి తెలియదు.

మీరు ఆవలించినప్పుడు మీ ముఖ కండరాలు సంకోచిస్తాయి. ఆ సమయంలో కన్నీటి గ్రంధులపై ఒత్తిడి పడుతుంది.

ఒత్తిడి వల్ల గ్రంధులను పిండినట్టు అవుతుంది. అప్పుడు అందులోని ఎక్కువ నీరు కళ్లల్లోకి చేరుకుంటాయి.

అందుకే ఆవలించినప్పుడు ఎక్కువ నీరు కంటిలోకి వచ్చి, బయటికి వచ్చేస్తాయి.

ఆవలింత ఒక అంటు వ్యాధి. ఒకరు ఆవలిస్తే పక్కనున్న వారికి కూడా ఆవలింతలు వచ్చేస్తాయి.

మెదడు రిలాక్సేషన్లో భాగంగా తన ఉష్ణోగ్రతను, అలసటను బయటికి పంపిస్తుంది.

ఒక వ్యక్తి జీవితకాలంలో రెండు లక్షల 40 వేల సార్లు ఆవలిస్తాడని అంచనా.