హాయిగా, ప్రశాంతంగా నిద్ర పోవాలని అనుకుంటే అందుకు పరిష్కారం.. వంటింట్లో దొరికే ఈ చిన్న వస్తువు వెల్లుల్లి రాత్రంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవాలంటే మీరు పడుకునే ముందు దిండు కింద కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి పూర్తిగా నయం అవుతుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో సల్ఫర్ పుష్కలంగా ఉండటం వల్ల ఘాటైన వాసన వస్తుంది. ఇది నిద్రని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి GABA అనే ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కండరాలని సడలిస్తుంది. మెదడు కణాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఇందులోని అల్లిసిన్ అనే సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లి రాత్రిపూట మెదడులో జరిగే చర్యని ప్రేరేపిస్తాయి. దీని వల్ల నిద్ర లేచిన వెంటనే తాజా అనుభూతి కలుగుతుంది. క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం పెద్దలు రాత్రి వేళ కనీసం 7-9 గంటల పాటు నిద్రపోవాలి. వెల్లుల్లిలో ఫాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. నిద్రని మెరుగుపరచడానికి వెల్లులి గొప్ప ఔషధం అని పూర్వీకుల నుంచి వస్తున్న వాదన.