నిద్ర రావడం లేదా? ఫూల్ మఖానా తినండి వీటిని ఆంగ్లంలో ‘Fox nuts’ అంటారు. తెలుగులో వీటిని తామర గింజలు అంటారు. వీటిని పచ్చివి తిన్నా, వండుకుని తిన్నా మంచిదే. వండిన వాటి కన్నా, పచ్చి వాటిలోనే పోషక విలువలు ఎక్కువ. ఆందోళన, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఉండడం వల్ల నిద్ర రాదు. రాత్రిపూట గ్లాసు పాలు తాగి, ఫూల్ మఖానా తింటే మంచి ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి పెద్ద రోగాలు దరికి చేరవు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. గర్భిణులకు, బాలింతలకు ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత రాకుండా కాపాడుతుంది. వీటిని నూనెలో వేయించకుండా, నేరుగా కళాయిలో వేయించుకుని తినాలి. పచ్చివి తిన్నా చర్మానికి మంచిదే.