ఆకుపచ్చను ఇష్టపడే వారి వ్యక్తిత్వం ఇదే ఒక్కొక్కరికి ఒక్కో రంగు ఇష్టం. వారు ఇష్టపడే రంగుని బట్టి కూడా వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. మీకు ఆకుపచ్చ రంగు ఇష్టమైతే మీరు డైన్ టు ఎర్త్ ఉంటారు. మీ గురించి ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మీరు చేసే పనులకు గుర్తింపు కావాలనుకుంటారు. ఈ రంగును ఇష్టపడే వారు మంచి వ్యక్తిత్వం కలవారిగా ఉంటారు. రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటారు. ఓపికగా కూడా ఉంటారు. అంశాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు. వీరు తార్కికంగా, విశ్లేషణాత్మకంగా ఏదైనా ఆలోచిస్తారు.