చలికాలంలో శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెరుగు ఒకటి. పెరుగు వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇందులోని కాల్షియం ఎముకలు, శరీరాన్ని దృఢంగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది. అపోహ: దగ్గు, జలుబు వస్తాయి వాస్తవం: పెరుగు తినొచ్చు. ఇందులోని ప్రోబయోటిక్స్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గుని దూరంగా ఉంచుతాయి. అపోహ: రాత్రిపూట పెరుగు తినకూడదు వాస్తవం: రాత్రిపూట పెరుగు తినడం వల్ల ట్రిప్టోఫాన్ కారణంగా న్యూరాన్లు తేలికపాటి విశ్రాంతితో రీఛార్జ్ అవుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. అపోహ: పాలిచ్చే తల్లులు పెరుగుకి దూరంగా ఉండాలి లేదంటే శిశువు అనారోగ్యం బారిన పడతారు వాస్తవం: పాలిచ్చే తల్లులు రాత్రిపూట లేదా చలికాలంలో పెరుగు తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా జలుబు ఉండదు. అపోహ: బరువు తగ్గాలని అనుకుంటే పెరుగు తీసుకోవద్దు వాస్తవం: పెరుగులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. Images Credit: Pexels