చాలామంది సరిగ్గా నిద్రపోలేరు. ఈ చిట్కాలు పాటిస్తే గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. గాఢమైన నిద్రను పొందాలంటే మీరు నిద్రపోతున్న వాతావరణం బాగుండాలి. ఎక్కువ వెలుతురు, శబ్దాలు లేని ప్రశాంతమైన ప్రాంతాన్ని నిద్రపోవడానికి ఎంచుకోండి. చీకటిగా ఉండే గదిలో త్వరగా నిద్రపడుతుంది. చీకటి గదిలో నిద్రపోవడం వల్ల 'మెలటోనిన్' అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మెలటోనిన్ హార్మోన్ గాఢ నిద్రకు సహాయపడుతుంది. 'మెలటోనిన్' హార్మోన్ ఎక్కువగా రాత్రివేళే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, లైట్ ఆర్పేసి నిద్రపోతే మంచిది. పడుకునే ముందు మొబైల్ ఫోన్లకు, ల్యాప్ టాప్‌లకు దూరంగా ఉండండి. ఎక్కువగా వెలుతురునిచ్చే లైట్లను కాకుండా డిమ్ లైట్లను వాడండి. Image Credit: Pixels and Pixabay