పిల్లలు స్వీయ సంరక్షణ చేసుకోలేరు. కాబట్టి, వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. గుడ్ టచ్ – చేతులు పట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం - అభద్రతకు గురిచేయనంత వరకు అవి మంచేవే అని చెప్పండి. బ్యాడ్ టచ్ - వ్యక్తిగత శరీర అవయవాలను ముట్టుకోవడం, చెడు ఉద్దేశంతో ప్రవర్తించడం. పిల్లలకు మీతో అన్ని విషయాలు చర్చించుకునే స్వేచ్ఛని ఇవ్వండి. వ్యక్తిగత శరీర భాగాల గురించి సరైన పదాలతో వివరించండి. ఎవరైనా వ్యక్తిగత శరీర భాగాలను టచ్ చేస్తే గట్టిగా నో చెప్పడం లేదా అరవడం చేయాలని నేర్పించండి. కథల రూపంలో గాని కార్టూన్ వీడియోలతో గాని అర్థం అయ్యేలా వివరించండి. ఎవరైనా వ్యక్తులు తప్పుగా ప్రవర్తిస్తే.. తల్లిదండ్రులకు తెలియజేసేలా పిల్లలకు నేర్పించాలి. Images Credit: Pixels and Pixabay