పిల్లలు ఫోన్లకు అలవాటుపడటానికి కారణం తల్లిదండ్రులే. పిల్లలు అన్నం తినడానికి, ఏడుపు ఆపడానికి ఫోన్లో బొమ్మల వీడియోలు చూపిస్తుంటారు. ఫోన్ అలవాటైతే.. అది లేనిదే అన్నం తినమని మారం చేస్తారు. చిరాకు పెడతారు. ఫోన్ పిల్లల్లో మెదడు ఎదుగుదలను దెబ్బ తీస్తుంది. ఎవరితో కలవకుండా ఫోన్‌తో ఉంటే పిల్లల్లో సామాజిక అభివృద్ధి ఉండదు. శారీరక వ్యాయమం లేకుండా ఎప్పుడూ ఫోన్ చూస్తూ కుర్చోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు మీ పిల్లలకు రాకూడదంటే.. ఈ చిట్కాలు పాటించండి. వీడియో రైమ్స్‌కు బదులు ఆడియో రైమ్స్ ప్లే చేయండి. లేదా తల్లిదండ్రులే పిల్లల కోసం పాడాలి. పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చేయాలి. వాళ్ళతో ఆడటం, మాట్లాడాలి. బయటకు తీసుకెళ్లాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వారితో ఆటలు ఆడాలి. కబుర్లు, కథలు చెప్పాలి. అప్పుడు వారితో బంధం బలోపేతం అవుతుంది. పిల్లల ముందు ఫోన్స్ ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే, మిమ్మల్ని చూసేవారు ఫోన్‌కు అలవాటు పడతారు. Images Credit: Pexels and Pixabay