టమాటో పులావ్ సింపుల్ రెసిపీ


బాస్మతి బియ్యం - రెండు కప్పులు
టమోటా ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
నెయ్యి - రెండు స్పూనులు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా



కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
నూనె - నాలుగు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
జీడిపప్పులు - ఎనిమిది
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు


అన్నం ముందుగా వండి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.

తరువాత టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, వేసి మూత పెట్టాలి.

చిన్న మంట మీద ఉడికించాలి. ఒక స్పూను నెయ్యి వేయాలి.

అందులో వేయించిన జీడిపప్పులు, కొత్తిమీరు తరుగు వేసి కలపాలి.

మిశ్రమం అంతా బాగా ఉడికాక స్టవ్ కట్టేయాలి. తరువాత అందులో ముందుగా వండుకున్న అన్నం వేసి కలపాలి.

టేస్టీ టమాట పులావ్ రెడీ.