గోల్డెన్ రైస్ మన దేశంలో దొరకవా? ఎర్ర బియ్యం, నల్లబియ్యం, తెల్ల బియ్యంలాగే గోల్డెన్ రైస్ కూడా పండుతోంది. పేరుకు తగ్గట్టే ఈ బియ్యం బంగారం రంగులో మెరిసిపోతుంటాయి. అన్నం వండితే పసుపు రంగులో ఉంటుంది. ఈ రంగు రావడానికి కారణం బీటా కెరాటిన్. బీటా కెరాటిన్ ఉన్నందుకే క్యారెట్లు అలా ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఈ బియ్యం జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధి చేశారు. ఇదొక బయోఫోర్టిఫైడ్ పంట. బీటా కెరాటిన్ శరీరంలో చేరాక విటమిన్ Aగా మారుతుంది. విటమిన్ ఎ మన శరీరానికి ఎంత అవసరమో తెలిసిందే. ఈ బియ్యాన్ని ఇద్దరు జర్మనీ శాస్త్రవేత్తలు సృష్టించారు. విటమిన్ ఎ లోపం అరికట్టేందుకు వీటిని పండించారు. ఈ బియ్యాన్ని బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, అమెరికా, కెనడా లాంటి అనేక దేశాలు ఆమోదించాయి. మనదేశంలో వీటిని పండించేందుకు, అమ్మడానికి ఆమోదం లేదు.