2010 లో ఆస్ట్రేలియా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఎక్కువ గంటలు కూర్చుని ఉండటం వల్ల 11 శాతం ముందస్తు మరణాన్ని పెంచుతుందని తేలింది.



ఒక రోజులో ఆరు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే మహిళలు తక్కువ సేపు కూర్చునే వారితో పోలిస్తే 37 శాతం త్వరగా చనిపోయే అవకాశం ఉంది.



గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.



పని లేదా ఇతర కారణాల వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల దీర్ఘకాలంలో ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.



కదలకుండా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల తల, మెడ, భుజాల నొప్పులు వస్తాయి. తల భారం అంతా మెడ మీద పడి కండరాలు నొప్పులు వస్తాయి.



నిటారుగా కాకుండా వంగి కూర్చోవడం వల్ల వీపు మీద ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వెన్ను నొప్పి వస్తుంది.



ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం రోజులో 6 గంటలకి పైగా కూర్చోవడం వల్ల డిప్రెషన్, ఆందోళన పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది.



అల్జీమర్స్, డీమెన్షియా వచ్చే ప్రమాదం ఉంది. మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.



అందుకే గంటల తరబడి కూర్చోకుండా కనీసం ప్రతి అరగంటకి ఒకసారైనా లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి.